
- బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్సీ అనంతబాబుపై కాకినాడ పోలీసులు గురువారం ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. నిందితుడి తరుపు న్యాయవాది వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 3కువాయిదావేశారు. సుబ్రహ్మణం హత్య జరిగి 88 రోజులు గడిచినా పలు సాంకేతిక కారణాలను సాకుగా చూపి పోలీసులు ఇంతవరకూ ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. చట్టం ప్రకారం 90 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉనాుయి. ఈ కేసులో పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడం, అనంతబాబుకుసహకరిస్తునాురనే ఆరోపణలు తలెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, న్యాయవాదులు, వామపక్షాలు, ప్రజా ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకుపోలీసులు ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. రాజమండ్రి ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక న్యాయస్థానంలో ఈ నెల 22న అనంతబాబు కేసు విచారణకురానుంది. మృతునికుటుంబం తరుపున ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు న్యాయపోరాటం చేస్తునాురు. హైకోర్టులో మాజీ న్యాయమూర్తి, న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ తన వాదనలు వినిపిస్తునాురు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలనివారు డిమాండ్ చేస్తునాురు.