
బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ డౌన్‌స్ట్రీమ్ లో వెబ్ అప్లికేషన్‌లకు సంబంధించిన నివేదికను శాండ్‌వైన్ విడుదల చేసింది. నెట్‌ఫ్లిక్స్ 14.9 శాతంతో అత్యధిక మెగాబైట్‌లను కలిగి ఉందని తెలిపింది. 11.4 శాతంతో తర్వాతి స్థానంలో యూట్యూబ్ ఉందని, గణనీయమైన షేరింగ్ వాటాతో డీస్నీ ప్లస్ 4.5 శాతం బాధ్యత వహిస్తుందని పేర్కొంది. వీడియో స్ట్రీమింగ్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో 2.8 శాతం వాటాను కలిగి ఉంది. సోషల్‌మీడియా, గేమింగ్ విభాగాలైన టిక్‌టాక్, ఫేస్‌బుక్, ప్లే స్టేషన్ మరియు ఎక్స్‌బాక్స్‌లు 2022లో పెద్దమొత్తంలో ఇంటర్నెట్ డౌన్‌స్ట్రీమ్ కి కారణమైనట్లు తెలిపింది.