శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనల్లని మబ్బులు

02 ఆగస్టు, 2026

nallani mabbi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కనుల పండువగా నల్లని మబ్బులు,

గగన సీమలో సాగేను పరుగులు.

చిటపట చినుకుల తొలి పలకరింపు,

మదిలో నింపేను కొత్త పులకరింపు.

తడిసిన నేలలో మట్టి పరిమళం,

జీవన వీణపై ఆనంద రాగాల గళం.

చెట్ల ముంగురుల పై జలకాలాటలు,

చిరునవ్వులు చిందించే బాలల పాటలు.

ఎండిన భూమికి దొరికిన వరమిది,

ప్రకృతి అందించిన అందాల హారమిది.

వాన రాకతో మురిసిపోయేను ధరణి,

రైతన్న కళ్లలో వెలిగేను నూతన మణి

sahasra

గోళ్ళమూడి కృష్ణ సహస్ర
8వ తరగతి, అట్కిన్‌సన్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌,
విజయవాడ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్