Oct 03,2022 16:14

ప్రజాశక్తి-ఆదోని: అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు తిరిగిన సంచరించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదోని వన్ టౌన్ సిఐ విక్రమ్ సింహ తెలిపారు గ‌త ఏడాది జూలై, డిసెంబ‌ర్ నెల‌ల్లో ఆదోని తిమ్మారెడ్డి బ‌స్టాండ్‌, శ‌రాఫ్ బ‌జార్‌లో చోరీ నిందితుల‌ను  వ‌న్‌టౌన్ పోలీస్ స్టేష‌న్ లో  సోమవారం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సిఐ విక్రమ్ సింహ వివరాలు వెల్లడించారు. డోన్ ప‌ట్ట‌ణం అనంత‌పురం హైవేలో ఇద్ద‌రు మ‌హిళ‌లు అనుమానాస్ప‌దంగా తిరుగుతున్న‌ట్లు  అందిన స‌మాచారం మేర‌కు సిబ్బందితో దాడులు నిర్వ‌హించి ప‌ల్నాడు జిల్లా చీరాల‌కు చెందిన నాగ‌మ‌ణి, ప‌ద్మ‌ల‌ను అరెస్టు చేసి 9 తులాల బంగారు ఆభ‌ర‌ణాల‌ను రిక‌వ‌రీ చేసిన‌ట్లు తెలిపారు. సదరు ఆభరణాలను పత్తికొండ, ఆదోని పట్టణంలోని శివ శంకర్ నగర్ కు చెందిన బాధితులకు అప్పగించామన్నారు ఇల్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న అప్రమత్తమై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు పుకార్లు నమ్మవద్దని ఎలాంటి అనుమానాలు ఉన్న తమను సంప్రదించాలని పురవాసులకు విజ్ఞప్తి చేశారు సమావేశంలో పోలీసులు హాజీ భాష ,మద్దిలేటి, లక్ష్మణ్ ఇతరులు ఉన్నారు.