Sep 25,2021 11:47

నర్సంపేట (వరంగల్‌) : కళాశాలలో ఘర్షణపడుతూ విద్యార్థిని మరో విద్యార్థి భవనం పైనుండి తోసేసిన ఘటన శుక్రవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... లక్నేపల్లి శివారు బిట్స్‌ కళాశాలలో నిన్న రాత్రి రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్న సంజయ్ను మరో విద్యార్థి భవనంపై నుంచి తోసేయడంతో సంజయ్ పై నుండి కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొడవకు గల కారణాలపై ఆరా తీశారు. సంజయ్ మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.