
'నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఇలాంటి రూమర్స్‌ను ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ ఓ వీడియో విడుదల చేశారు. కొన్ని రోజులుగా సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాలేదని.. ఐసీయూలో ఉన్నారంటూ మరికొందరు రూమర్స్ వినిపిస్తున్నారు. వీటిపై స్పందిస్తూ సుధాకర్ ఈ వీడియో విడుదల చేశారు.