Aug 10,2022 08:16

(ప్రజాశక్తి స్పోర్ట్స్‌ డెస్క్‌) : బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు రెజ్లింగ్‌ విభాగంలో అత్యధికంగా 12 పతకాలు వచ్చాయి. ఆ తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో 10 పతకాలు వచ్చాయి. 210మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్‌కు వెళ్తే 22 పతకాలు ఈ రెండు ఈవెంట్‌ల నుంచే వచ్చాయి. ఈ క్రీడల్లో భారత్‌ 22స్వర్ణ, 16రజత, 23కాంస్యాలతో సహా మొత్తం 61పతకాలతో నాల్గో స్థానంలో నిలిచింది. షూటింగ్‌కు ఈసారి చోటు దక్కకపోవడంతో టాప్‌-5లో నిలవడం కష్టమేనని భావించినా.. ఆ మార్క్‌కు చేరుకోగలిగాం. ఈసారి కూడా స్వర్ణ పతకాల వేటను వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానునే ప్రారంభించింది. మహిళల 49కిలోల విభాగంలో ఆమె తొలి పసిడిని అందించింది. టేబుల్‌ టెన్నిస్‌లో వెటరన్‌ శరత్‌ కమల్‌ స్వర్ణంతో పతకాల వేట ముగి సింది. భారీ అంచనాలతో బరిలో దిగిన పురుషుల హాకీ జట్టు, మహిళల క్రికెట్‌ జట్టు రజత పతకాలతో సరిపెట్టుకున్నాయి. మొత్తం 72దేశాల నుంచి 20 క్రీడాంశాలకు సంబంధించి 5వేలమందికి పైగా అథ్లె ట్లు పాల్గొంటే.. భారత్‌ నుంచి 210మంది ప్రాతిని ధ్యం వహించారు. ఆతిథ్య ఇంగ్లండ్‌ నుంచి అత్యధికంగా 438మంది, ఆస్ట్రేలియానుంచి 427మంది పాల్గొన్నారు.
బెటరే.. కానీ..
2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడలతో పోల్చిచూస్తే ఈసారి భేషుగ్గానే మన అథ్లెట్లు రాణించారు. ఈ క్రీడల్లో మొత్తం 61పతకాలను సాధిచారు. గత క్రీడల్లో భారత్‌కు 66పతకాలు దక్కితే.. ఈసారి ఐదు పతకాలు తగ్గాయి. 2018లో షూటింగ్‌ విభాగంలోనే 16 పతకాలు రాగా.. ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో షూటింగ్‌కు చోటు దక్కలేదు. మహిళల క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ 3-3, వీల్‌చైర్‌ బాస్కెట్‌ బాల్‌ 3-3, మిక్స్‌డ్‌ సింక్రనైజ్డ్‌ డైవింగ్‌, పారా క్రీడలకు కామన్వెల్త్‌ క్రీడల్లో చోటు దక్కింది. అయినా మనకు 61 పతకాలు దక్కా యంటే ఫర్వాలేదు. మహిళల హాకీ జట్టు కాంస్యం సాధించింది. పారా క్రీడల్లో 2పతకాలు దక్కాయి. వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌లో ఈసారి అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం అందించిన సాగర్‌ సంకేత్‌ ఓ పాన్‌వాలా కొడుకు. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెలుగు లోకి తీసుకొస్తే భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని పతకాలు దక్కడం ఖాయం.
2022 కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల గెలిచిన అథ్లెట్లు..
బంగారు పతక విజేతలు(22)...
రెజ్లింగ్‌(6): నవీన్‌ కుమార్‌, వినేష్‌ ఫోగట్‌, రవి, దీపక్‌, బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌
వెయిట్‌ లిఫ్టింగ్‌ (3): అచింత షౌలీ, లాల్‌రినుంగ జెరెమీ, మీరాబాయి ఛాను
టేబుల్‌ టెన్నిస్‌ (4): శరత్‌ కుమార్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌(శరత్‌, శ్రీజ ఆకుల), భవీనా పటేల్‌(మహిళల సింగిల్స్‌ క్లాసెస్‌ 3-5), పురుషుల టీం (హర్మీత్‌, సునీల్‌, శరత్‌, సాతియాన్‌ జ్ఞానశేఖర్‌)
పారా పవర్‌లిఫ్టింగ్‌: సుధీర్‌ జి
లాన్‌ బౌల్స్‌: మహిళల ఫోర్స్‌ (లవ్లీ చౌబే, రూపా రాణీ, పింకీ, నయన్‌మోని సైకా)
బాక్సింగ్‌ (3): నిఖత్‌ జరీన్‌, అమిత్‌ పంఘాల్‌, నీతూ ఘంఘాస్‌
బాడ్మింటన్‌ (3): పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌ రెడ్డి, చిరాగ్‌ శెట్టి), లక్ష్యసేన్‌, పివి సింధు
అథ్లెటిక్స్‌: ఎల్డ్‌హౌస్‌ పాల్‌
రజత పతక విజేతలు (16)...
అథ్లెటిక్స్‌ (4): అబ్దుల్లా అబూబకర్‌, అవినాష్‌ ముకుంద్‌, ప్రియాంక, శ్రీశంకర్‌,
బాడ్మింటన్‌: మిక్స్‌డ్‌ టీం ఈవెంట్‌ (కిదాంబి, సాత్విక్‌-సుమిత్‌, లక్ష్యసేన్‌, చిరాగ్‌ శెట్టి, త్రీషా, ఆకర్షి కశ్యప్‌, పొన్నప్ప, గాయత్రి, సింధు)
బాక్సింగ్‌: సాగర్‌ అహ్లావత్‌
క్రికెట్‌: మహిళల జట్టు
హాకీ: పురుషుల జట్టు
జూడో (2): తులికా మాన్‌, సుశీలా దేవి
లాన్‌ బౌల్స్‌: పురుషుల ఫోర్స్‌ టీం
టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల డబుల్స్‌ (శరత్‌ కమల్‌, సాతియాన్‌ జ్ఞానశేఖరన్‌)
వెయిట్‌ లిఫ్టింగ్‌ (3): వికాస్‌ ఠాకూర్‌, బింద్యారాణి దేవి, సంకేత్‌ మహాదేవ్‌ సర్గార్‌
రెజ్లింగ్‌: అన్షు మాలిక్‌
కాంస్య పతక విజేతలు(23)..
రెజ్లింగ్‌(5): దీపక్‌ నెహ్రా, పూజా సిహాగ్‌, పూజా గెహ్లాట్‌, మోహిత్‌ గ్రెవాల్‌, దివ్య కక్రాన్‌
వెయిట్‌లిఫ్టింగ్‌ (4): గుర్దీప్‌ సింగ్‌, లవ్‌ప్రీత్‌ సింగ్‌, హర్జీందర్‌ కౌర్‌, గురురాజ పూజారి
టేబుల్‌ టెన్నిస్‌ (2): సాతియాన్‌ జ్ఞానశేఖరన్‌, సోనాల్‌బేన్‌ మనుభాయి పటేల్‌
స్క్వాష్‌ (2): మిక్స్‌డ్‌ డబుల్స్‌ (దీపికా పల్లికల్‌, సౌరవ్‌ ఘోసల్‌), సౌరవ్‌ ఘోసల్‌
జూడో: విజయ్ కుమార్‌ యాదవ్‌
హాకీ: మహిళల జట్టు
బాక్సింగ్‌ (3): రోహిత్‌ టోకాస్‌, హుస్సాముద్దీన్‌ మహమ్మద్‌, జాస్మిన్‌ లంబోరియా
బాడ్మింటన్‌ (2): మహిళల డబుల్స్‌ (జాలీ ట్రీసా, పుల్లెల గాయత్రి), కిదాంబి శ్రీకాంత్‌
అథ్లెటిక్స్‌: అన్ను, సందీప్‌, తేజస్విన్‌.