Dec 08,2022 12:10

ప్రజాశక్తి-నందిగామ : సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోపూరి సంగీతరావు సతీమణి స్వరాజ్యలక్ష్మీ (74) గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహనరావు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, డూలాస్ ట్రస్టు చైర్మన్ పగిడిపల్లి దేవసహాయం, కాంగ్రెస్ నాయకులు పాలేటి సతీష్,కామా శ్రీనివాసరావు, గోపు నరేంద్ర, వజ్రయ్య  పలువురు ప్రముఖులు స్వరాజ్యలక్ష్మి భౌతికకాయంకు నివాళులర్పించారు. విషాదంలో సంగీతరావును పలువురు ఓదార్చి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.