Nov 26,2022 14:58
  • 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లీడర్స్ యూత్ సొసైటీ నల్లారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివాళి

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : రాజ్యాంగ ద్రోహి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హ ఫీజు ఖాన్  అన్నారు. శనివారం లీడర్స్ యూత్ సొసైటీ, నల్లారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కేదార్నాథ్ తో కలిసి స్థానిక కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ నందలి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లీడర్స్ యూత్ సొసైటీ, నల్లారెడ్డి ఫౌండేషన్  కేదార్ నాథ్ మాట్లాడుతూ 1949 నవంబర్​ 26 భారత రాజ్యాంగం ఆమోదం పొందిందన్నారు. నేటికి 73ఏళ్లు గడిచినా భారత కరెన్సీ పై అంబేద్కర్ ముఖచిత్రాన్ని ముద్రించటం లేదన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25 మంది గవర్నర్లు మారినా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి గౌరవం దక్కలేదని వాపోయారు. రాజ్యాంగ నిర్మాణం వెనక ఎన్నో పోరాటాలు, ఆకాంక్షలు, సామాజిక విప్లవ అభినివేశాలు ఉన్నాయన్నారు. కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కాలం 3 సంవత్సరాల మథనం, 165 రోజులు, అధికరణలు 395, షెడ్యూళ్లు 12తో కూడిన శ్రమకు ఆమోదం లభించిన రోజు ఇది అన్నారు.  1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిందన్నారు. వికేంద్రీకరణకు మద్దత్తు ఇవ్వని చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ద్రోహిని అన్నారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. రాజ్యాంగ పరిషత్తు నుండి ఆమోదం వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఆనాటి మేధావుల పరిజ్ఞానానికి గుర్తుగా నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించి, ప్రతి ఒక్కరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమన్యాయం ఉండాలని భారత రాజ్యాంగాన్ని నిర్మించారని, అటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నేడు దేశంలో మరే రాష్ట్రమూ కనీసం ఊహించని విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సామాజిక మహా విప్లవానికి శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వంమేనని,  అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి శాచ్యురేషన్ పద్ధతిలో, అత్యంత పారదర్శకంగా, అవినీతీ, వివక్షా లేకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా చర్యలు చేపట్టిందని అన్నారు. మంత్రి పదవులు, ఉపముఖ్యమంత్రి పదవులు, బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు. ఇలా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విప్లవాత్మక చర్యలతో ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి బాటలు వేసిందని, ఇక సంక్షేమ ఫలాల లబ్ధి విషయంలో కూడా దాదాపు మూడొంతులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అందించిన ఏకైక మన ప్రభుత్వం మనదేనని  అన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు బాబా సాహెబ్ ని, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కులాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించి, ప్రతి ఒక్కరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమన్యాయం ఉండాలని భారత రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ ని, భారత సమాజానికి అత్యుత్తమమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు,  ‘విశ్వ మానవుడు  డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ అని అభివర్ణించారు. దేశంలోని పీడిత ప్రజలు తమ సమస్యలు లేవనెత్తేందుకు, హక్కులను సాధించుకునేందుకు అంబేద్కర్‌ వారికి గొంతుక నిచ్చారని పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో, మేధో సంపత్తితో దేశంలోని పేదలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పనిచేశారని , వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబేద్కర్ చూపిన మార్గంలోనే సమాజంలోని పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు పునరంకితమవుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెస్త అనిల్, మధు, ఆది శేషు, వసంత్, జేశ్వంత్, బంటుపల్లి రాజేష్, రాజు, హరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.