Nov 26,2022 15:07

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివాకర్ ఇతర శాఖల అధికారులు రాజ్యాంగ నిర్మాత ఎంపీడీవో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రెండవ సచివాలయంలో ఎంపీటీసీ గవ్వల రమాదేవి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాజ్యాంగం గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ అధ్యక్షతన రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తి అయినప్పటికీ 1930 జనవరి 26న అప్పటి జాతీయ నాయకులు చేసిన సంపూర్ణ స్వాతంత్ర తీర్మానానికి చిహ్నంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని వాస్తవంగా రాజ్యాంగ రచన నవంబర్ 26 మే పూర్తి అయింది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం (National Law Day)గా కూడా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సచివాలయాలకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కార్మిక పంచాయతీ కార్యాలయంలో రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లప్ప తదితరులు నివాళులర్పించారు.