Nov 26,2022 15:10

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: మండలంలోని గ్రామాల సచివాలయాల్లో, వివిధ పాఠశాలలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వేలివెన్నులో జడ్పిటిసి భాస్కర రామయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా, ఏపీ ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు చెట్టే సుజన రావు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  వేలివెన్ను గ్రామ సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ బూరుగుపల్లి శ్రీనివాసు,  ఏపీ ఎమ్ ఆర్ పి ఎస్ స్టేట్ కో-ఆర్డినేటర్ కొడవటి బుజ్జి మాదిగ, మండవల్లి రాజేశ్వరరావు మాదిగ లు పాల్గొన్నారు. కాల్దారి లో ఎంపీడీవో ఏ శ్రీనివాస్, ఈ ఓపిఆర్డి ముత్యం వీరాస్వామి నాయుడు, హౌసింగ్ ఏఈ ఎం.విక్టర్ బాబు, పంచాయతీ కార్యదర్శి వీ. శ్రీనివాస్, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సురేష్ లతోపాటు వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది.