
- అధికార పార్టీ సభ్యులు విపక్ష సభ్యులుగా అయిన వేళ సమావేశ బాయికాట్ హెచ్చరికతో కదలిన టౌన్ ప్లానింగ్ యంత్రాంగం
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : రెండేళ్ల పాలన పూర్తి అవుతున్న ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందాన ఉన్నాయని, కార్పొరేటర్లు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోందని అధికార పార్టీ సభ్యులు అధికార యంత్రాంగంపై ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక కౌన్సిల్ హాలులో సాధారణ సర్వసభ్య సమావేశం మేయర్ మహమ్మద్ వసీం అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే ఏడవ డివిజన్ కార్పొరేటర్ నాగమణి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంట్రల్ పార్క్ స్థలం అన్యాక్రాంతమవుతున్న పరిరక్షణ చర్యలు చేపట్టడంలో టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుందని ఆరోపిస్తూ మేయర్ పోడియం ముందు బైఠాయించింది ఆమెకు మద్దతుగా మిగిలిన అధికార పార్టీ కార్పొరేటర్ లు మద్దతు పలికారు నాగమణితోపాటు కో ఆప్షన్ సభ్యురాలు ఉమా మహేశ్వరి కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్ పోడియం వద్ద బైఠాయించారు. సెంట్రల్ పార్క్ స్థలం సర్వే జరిపారని ఆ నివేదికను బహిర్గతం చేయాలని వారు గంటకు పైగా బైఠాయించారు. అయినా అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు నివేదికను సభ ముందు ఉంచటానికి ఆసక్తి చూపలేదు. అలాగే ఎఫ్ఎసి కమిషనర్ గా ఉన్న రమణారెడ్డి సైతం రెండేళ్లుగా అదనపు కమిషనర్ హోదాలో కొనసాగుతున్న ఈ అంశంపై అవగాహన లేదని తప్పించుకో చూశారు. దీనిపై డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్వయంగా తాను రమణారెడ్డితో సుదీర్ఘంగా చర్చించానని సర్వే నివేదికను బహిర్గతపరచాలని సభ్యులు కోరిన ఆ దిశగా చర్యలు చేపట్టకుండా అవగాహన లేదని తప్పించుకోచూడడం దారుణం అన్నారు. ఇలాంటి అధికారులు ఉండటం వలన కార్పొరేషన్కు చెడ్డ పేరు వస్తోందని ధ్వజమెత్తారు ఇలాంటి అధికారులను బదిలీ చేయాలని కోరుతూ మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కు వెంటనే లేఖ రాయాలని డిమాండ్ చేశారు ఈ దశలో కార్పొరేటర్ నీలావతి లేచి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి జెసిబి లు అడిగితే అందుబాటులో లేవని సమాధానం చెప్పే అధికారులు అక్రమ కట్టడాలు జోలికి మాత్రం వెళ్లకుండా దుప్పట్ల వ్యాపారం చేసే చిరు వ్యాపారుల వద్దకు ఆగమేఘాలపై జెసిబిలు తీసుకొచ్చి దుప్పట్ల తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు. అనుమతులు ఇచ్చిన భవనాల వివరాలు కోరిన వారు స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ కట్టడాలను కూల్చి వేయకుండా ముడుపులు పుచ్చుకొని వాటి నిర్మాణం పనులు పూర్తయ్యాలా దగ్గరుండి చర్యలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తరు. ఈ దశలో 50వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల వరదల సమయంలో నాలుగైదు రోడ్డు ప్రాంతాలు వివిధ కాలనీలు రజక నగర్ ముంపుకు గురయ్యాయి అన్నారు నడిమి వంకను ఆక్రమించి రంగప్ప మట్టితో చదును చేయించగా కాలనీలన్నీ ముంపు గురయ్యాయి అన్నారు ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్రమిత స్థలంలోని మట్టిని తొలగింప చేశారన్నారు దీనితో వరద నీరు వెళ్ళిపోయి ముంపు ప్రమాదం తప్పిందన్నారు. అయితే ఇటీవల తిరిగి నడిమి వంక కాలువను పూడ్చివేస్తూ రంగప్ప మట్టితో చదును చేయించారన్నారు గతంలో మాదిరిగా తిరిగి వర్షాలు కురిస్తే ఇల్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. వంకలు కాలువలు రోడ్లను ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతుంటే టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ముడుపులు దండుకుని చోద్యం చూస్తోందన్నారు పైపెచ్చు కార్పొరేటర్ల పేర్లు వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు అన్నారు. వారి అవినీతి కారణంగా తమ డివిజన్లో ప్రజలకు ముఖం చూపించలేకున్నామన్నారు అధికారుల అవినీతికి తమ పేరు వాడుకోవటం ఎంతవరకు సమంజసంమని ప్రశ్నించారు ఇంత గొడవ జరుగుతున్నా అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు సెంట్రల్ పార్క్ స్థలం సర్వే నివేదికను తీసుకురాకుండా ఉండటంపై అధికార పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించడంతో అధికార యంత్రాంగం కదిలింది పోడియం దిగివచ్చి మేయర్ మహమ్మద్ వసీం పోడియం దిగివచ్చి బైఠాయించిన కార్పొరేటర్లను వారి స్థానాలకు వెళ్లి కూర్చోవాల్సిందిగా నచ్చ చెప్పారు. దీంతో వారు లేచి తమ సీట్లలో కూర్చున్నారు అసిస్టెంట్ సిటీ ప్లాన్ శ్రీనివాసులు ఫైల్ తీసుకువచ్చి నివేదిక లేదంటూ ఎఫ్ఎంబి ప్లాన్ చూపించారు సర్వే నివేదిక ఇది కాదంటూ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ దశల అధికార పార్టీ కార్పొరేటర్లు అబుసాలేహ వాసంతి లీలావతి నరసింహులు శ్రీనివాసులు లక్ష్మిరెడ్డి సైదుల్లా బేగ్ తదితరులు మాట్లాడుతూ కౌన్సిల్లో ప్రతిపక్షం లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ సభ్యులు విపక్ష సభ్యులుగా మారి అధికారులను నిలదీస్తామన్నారు తూతూ మంత్రంగా జరిపే సమావేశాలకు వచ్చి టీ బిస్కెట్లు తిని తాగి వెళ్లే రకం కాదంటూ అల్టిమేట్ జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసేలా చర్యలు చేపట్టాలని అధ్యక్ష స్థానంలో ఉన్న మేయర్ మహమ్మద్ వసీంను కోరారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికై వచ్చిన కార్పొరేటర్లకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఎనిమిది నెలలకు ఒకసారి సమావేశాలు జరిపితే ఎలాగని వారు నిలదీశారు. అధికారులు కార్పొరేటర్లకు జవాబుదారీగా ఉండి సమస్యలు పరిష్కరించాలి అని కోరారు. కార్పొరేటర్ లను చులకనగా చూసే అధికారుల వైఖరిని మార్చుకొని తీరాలన్నారు మార్చుకోకుంటే ప్రజా సమస్యలపై ప్రతిపక్ష సభ్యులుగా మారి నిలదీసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కౌన్సిల్ సమావేశంలో సెంట్రల్ పార్క్ అంశంపై గంటకు పైగా అధికార పార్టీ సభ్యులు ఏకతాటిపై నిలదీస్తే కానీ అధికారులలో చలనం రాకపోవటం దారుణమన్నారు. ఇతర ప్రజా సమస్యల ప్రస్తావనకు చాలినంత సమయం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.