Jun 23,2022 10:07

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజు 12వేలకు పైగా కేసులు ఉండగా.. తాజాగా 13 వేలను మించిపోయాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం 6,56,410 మందికి పరీక్షలు చేపట్టగా.. 13,313 కొత్త కేసులు వెలుగుచూశాయి. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 10,972 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,33,44,958కు చేరుకోగా.. 5.24 లక్షల మందిని మహమ్మారి బలితీసుకుంది. 4.27కోట్ల మంది కోవిడ్‌ను జయించారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్‌ కేసులున్నాయి. రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 14,91,941 డోసులు వినియోగం కాగా.. ఇప్పటి వరకు 196 కోట్లకు పైగా వ్యాకిన్లు పంపిణీ అయ్యాయి.