Oct 13,2021 13:54

న్యూఢిల్లీ : కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 15,823 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే క్రితం రోజు (14,313)కంటే 1500లకుపైగా కేసులు పెరిగాయి. అయితే ఇప్పటివరకు 3,40,01,743 మందికి కరోనా సోకింది. కాగా, కరోనాతో మంగళవారం 226 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,51,189కి చేరింది. నిన్న ఒక్కరోజే 22,844మంది కోలుకున్నారు. ఇక రికవరీ రేటు 98.06 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,07,653 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక క్రియాశీల రేటు 0.61 శాతంగా ఉంది.
వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా.. మంగళవారం ఒక్కరోజే 50.63 లక్షల మంది టీకా వేయించుకున్నారు. కేంద్రం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 96.43 కోట్లకు చేరింది.