May 14,2022 10:51
covide

ఢిల్లీ : కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. మహమ్మారి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు దిగొస్తున్నాయి. శుక్రవారం 4.86 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,858 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 3,355 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. తాజాగా ఆ సంఖ్య 18,096కి తగ్గిపోయింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 5.24 లక్షల మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 15.04 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 191 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయని శనివారం కేంద్రం వెల్లడించింది. అలాగే విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్‌ డోసు వ్యవధిలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. రెండో డోసు, బూస్టర్‌ డోసు మధ్య అంతరాన్ని 9 నెలల నుంచి 90 రోజులకు కుదించింది.