Sep 27,2021 16:32

అమరావతి : గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,069 మందికి పరీక్షలు నిర్వహించగా.. 618 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ వల్ల 6 మంది మరణించారు. తాజా కేసులు, మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా 20,47,459 మంది వైరస్‌ బారినపడగా, మృతుల సంఖ్య 14,142కి  చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ లో వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 1,178 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,89,391కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,482 యాక్టివ్‌ కేసులున్నాయి.