
బీజింగ్: చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి) కేంద్ర కమిటీ , స్టేట్ కౌన్సిల్ పార్టీ, ప్రభుత్వ సంస్థలను మరింత పటిష్టపరచే దిశగా ఓ ప్రణాళికను రూపొందించింది. ఇందుకు సంబంధించిన సర్కులర్‌ను సిపిసి ఇటీవల జారీ చేసింది. 18వ సిపిసి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మొదలుకుని, పార్టీ, ప్రభుత్వ సంస్థలనన్నిటిని మరింత పటిష్టపరిచే యత్నాలు జరుగుతున్నాయి. చైనా సంపూర్ణ పరివర్తనకు పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు నిర్వర్తించాల్సిన విధులను నిర్దిష్టంగా ప్రణాళిక పేర్కొంది. నూతన కర్తవ్యాలు సాఫీగా అమలు జరిగేలా చూసేందుకు సంస్థాగత నిర్మాణం, పార్టీ , ప్రభుత్వ సంస్థల విధుల్లో సంస్కరణలు, సర్దుబాట్లు అవసరమని సిపిసి పేర్కొంది. కీలకమైన రంగాలలో సంస్థాగత సంస్కరణలను మరింత లోతుగా చేయడానికి, సోషలిస్ట్ ఆధునీకరణపై పార్టీ నాయకత్వం మరింతగా కేంద్రీకరించి పనిచేసేందుకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని పేర్కొంది. సైన్స్ అండ్ టెకాులజీ కోసం సెంట్రల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆ ప్రణాళిక సూచించింది. సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలనికూడా పేర్కొంది. ఈ డిపార్టుమెంట్ ప్రజా ఫిర్యాదుల నిర్వహణ, ప్రజల అభిప్రాయాలను సేకరించడంలో సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. అవసరమైనప్పుడు తగు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. అలాగే ప్రభుత్వేతర సంస్థలలో పార్టీ నిర్మాణం, కొత్త రకాల ఆర్థిక,సామాజిక సంస్థలు, కొత్త రకాల ఉపాధిలో సమూహాల మధ్య సమన్వయంపైన కేంద్రీకరిస్తుంది. అలాగే జాతీయ ప్రజా ఫిర్యాదులు, ప్రతిపాదనల నిర్వహణను పర్యవేక్షిస్తుంది .ప్రాంతీయ, మునిసిపల్, కౌంటీ స్థాయిలలో పార్టీ కమిటీలు తదనుగుణంగా తమ సామాజిక కార్య విభాగాలను ఏర్పాటు చేస్తాయి. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పిసి) డిప్యూటీల పనినిపర్యవేక్షించి ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రణాళిక పేర్కొంది. చైనా పీపుల్స్ బ్యాంక్ స్థానిక శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు నిర్దిష్టంగా కొనిు సూచనలు చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఫైనాన్షియల్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రణాళిక సూచించింది. జాతీయ డేటా బ్యూరోఏర్పాటు, . వృద్ధుల సంరక్షణ యంత్రాంగాన్ని, మేధో సంపత్తి హక్కుల నిర్వహణ యంత్రాంగాన్ని మెరుగుపరచేందుకు పలు సూచనలు చేసింది. పార్టీ, ప్రభుత్వ సంస్థల సిబ్బంది, వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించేలా చూసేందుకుకొనిు చర్యలను ప్రతిపాదించింది. సెంట్రల్ పార్టీ, ప్రభుత్వ సంస్థలు తమ సిబ్బందిని 5 శాతం తగ్గించుకుంటాయని ప్రణాళిక పేర్కొంది. స్థానిక పార్టీ, ప్రభుత్వ సంస్థలలో సిబ్బంది ఆప్టిమైజ్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించే విచక్షణాధికారాన్ని ప్రాంతీయ స్థాయి పార్టీ కమిటీలకు వదిలివేసింది. ఇటువంటి అనేక మార్పులను ప్రణాళిక పేర్కొంది. కంద్ర అధికారులు 2023 చివరి నాటికి ఈ సంస్కరణల ప్రక్రియను పూర్తి చేస్తారు, స్థానిక ప్రభుత్వాలు మాత్రం ప్రణాళికలో నిర్దేశించిన గదువు ప్రకారమే 2024 చివరి నాటికి దీనిని పూర్తి చేస్తాయి.