Aug 19,2022 14:59
  • సిపిఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
  • కాకినాడలో సిపిఐ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ 

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యంగా ఉందని జగన్ పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని సిపిఐ  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. శుక్రవారం స్థానిక కాకినాడ పిఆర్ కార్మిక భవన్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. అంతకుముందు రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆయన ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తి, ప్రసంగిస్తారన్నారు. ఈ రాష్ట్రం మహాసభల్లో నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తార న్నారు. అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు జరగనున్నాయని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ పిఎస్ నారాయణ బొబ్బిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు