ప్రజల జీవనోపాధిపై దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాపిత నిరసనలు : సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు

- ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు
- త్రిపురలో ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలి
- ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
కోల్‌కతా : నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రజల జీవనోపాధిపై నిరంతరం దాడులు కొనసాగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 22 నుండి 28 వరకువారం రోజుల పాటు దేశవ్యాపితంగా నిరసనలు చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ తన పార్టీ శ్రేణులకు సోమవారం పిలుపునిచ్చింది. త్రిపురలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగాలంటే అక్కడ ప్రజాతంత్ర హక్కులను వెంటనే పునరుద్ధరించాలని అది పునరుద్ఘాటించింది. ఈ నెల 28, 29 తేదీల్లో కోల్‌కతాలో సమావేశమైన పార్టీ కేంద్ర కమిటీ పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం సోమవారం నాడిక్కడ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
- అదానీ గ్రూప్ అవినీతి బాగోతం
అదానీ గ్రూప్ అక్రమాలను బట్టబయలు చేస్తూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. ఈ విచారణను సుప్రీం కోర్టు రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించాలి. విచారణ పూర్తయి, వాస్తవాలు వెల్లడయ్యేవరకు భారతదేశ, ప్రజల ప్రయోజనాలు పరిరక్షించబడాలి. ఎల్‌ఐసికి చెందిన దాదాపు రూ.80వేల కోట్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. అదానీ గ్రూపు జాతీయ బ్యాంకుల నుండి తీసుకున్న మొత్తం రుణాల్లో దాదాపు 40శాతం ఎస్‌బిఐ ద్వారా తీసుకునువే. కోట్లాదిమంది భారతీయులు తమ భవిష్యత్ భద్రత కోసం ఎల్‌ఐసి, ఎస్‌బిఐల్లో దాచుకునాురు. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగు చూసినప్పటి నుండి స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూపుల పెట్టుబడుల సమీకరణ ఏకంగా 5వేల కోట్ల డాలర్లకుపైగానే పడిపోయినందున, ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజల జీవితకాలపు పొదుపు మొత్తాలు నాశనమయ్యే స్థితికి ఇది దారి తీయరాదు. సిపిఎం ఇతర లౌకిక ప్రతిపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుని రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అదానీ వ్యవహారాన్ని లేవనెత్తనుంది.
- భారతదేశ ఆర్థిక వ్యవస్థ
మాంద్యం ధోరణులు ఉధృతమవుతుండడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం మరింత తీవ్రతరం కావడంతో స్తబ్దత అలానే కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ప్రభుత్వం ఎంతగా ఊదరగొడుతున్నప్పటికీ భారతదేశ ఉత్పాదక సామర్ధ్యాలను పెంచేలా పెట్టుబడులు పెరగడం లేదు. అంటే ఉపాధి కల్పన స్తబ్దుగా వుందని అర్ధమవుతోంది. క్షీణించకపోయినా మరింతగా దారిద్య్రం, ఇబ్బందులు పెరగడానికి దోహదపడుతోంది.
- అభ్యంతరకర రీతిలో అసమానతల పెరుగుదల
40శాతానికి పైగా ప్రజల సంపదంతా కేవలం ఒక్క శాతం మంది దగ్గర పోగు పడిందని 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ : ది ఇండియా సప్లిమెంట్' శీర్షికతో విడుదల చేసిన ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దేశంలో 10మంది సుసంపనుుల మొత్తం సంపద 2022లో రూ.27.52 లక్షల కోట్లు వుంది. 2021తో పోలిస్తే ఇది 32.8శాతం ఎక్కువ. కిందిస్థాయిలోని50శాతం మంది జనాభా వద్ద కేవలం 3శాతం సంపద మాత్రమే వుంది.
2020లో మొత్తం శత కోటీశ్వరుల సంఖ్య 102గా వుండగా, 2022లో ఈ సంఖ్య 166కి పెరిగింది. దీనికి పూర్తి విరుద్ధంగా దాదాపు 23కోట్ల మంది ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం.
భారతదేశంలోని తిరోగమన పనుుల వ్యవస్థను ప్రస్తావిస్తూ, అత్యంత సంపనుులైన 10శాతం మందితో పోలిస్తే దిగువన ఉను 50శాతం మంది జనాభా పరోక్ష పన్నుల రూపేణా చెల్లిస్తున్న మొత్తం ఆరు రెట్లు అధికంగా ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఆహారం, ఆహారేతర నిత్యావసరాల నుండి వసూలు చేసిన మొత్తం పన్నుల్లో దిగువ 50శాతం మంది 64.3శాతం చెల్లిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం సంపనుులకు ఇస్తూ వస్తున్న పన్ను రాయితీలను సవరించాల్సిన సమయం ఆసనుమైంది. సంపద పన్ను, వారసత్వపు పన్నులను ప్రవేశపెట్టాలి. అన్ని నిత్యావసరాలపైన ముఖ్యంగా ఆహార ఉత్పత్తులపై జిఎస్‌టిని రద్దు చేయాలి.
- ముదురుతున్న మతోన్మాద పోకడలు
మతోన్మాద పోకడలకు మరింత పదును పెట్టేందుకు హిందూత్వ శక్తులు అనేక మార్గాల్లో తమ యత్నాలను ఉధృతం చేస్తున్నాయి.. తమ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలుతో ముందుకు సాగుతామని బిజెపి పాలిత రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. దీని వెనుకనే ముస్లిం పర్సనల్ లాను రద్దు చేయాలంటూ గావు కేకలు పెడుతున్నాయి.. ఇప్పటికే లవ్ జిహాద్ లేదాగో సంరక్షణ పేరుతో ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి.. స్వచ్ఛందంగా మత మార్పిడి, మతాంతర వివాహాలను నిషేధిస్తూ అందులో షరతులు పెట్టారు.. విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్ధులపై ప్రమాదకరమైన రీతిలో విద్వేష ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న వార్తలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ముస్లిం మైనారిటీల మౌలిక రాజ్యాంగ హామీలను తిరస్కరిస్తూ అభ్యంతరకరమైన రీతిలో మతోన్మాద దృక్పథాన్ని ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రభుత్వం దూకుడుగా అనుసరిస్తోంది. ఇటీవలే, ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో ప్రఖ్యాతి చెందిన ఉర్దూ ప్రార్ధనా గీతాన్ని పాడుతున్న పిల్లలను ఆ స్కూలు ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.
చత్తీస్‌ఘడ్‌లోని ఉత్తర బస్తర్ జిల్లాలో క్రైస్తవులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ దాడులకు తెగబడుతున్నారు. బలవంతంగా మత మార్పిడి జరిగిన కేసు ఒక్కటి కూడా లేదని పరిశీలనలో తేలింది. . క్రైస్తవ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని, దాడులకు పాల్పడాలను ఎజెండాను వారు ఇక్కడ అనుసరించారని, అలాగే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల ప్రాపకంలో బజరంగ్ దళ్ చేపట్టిన 'ఘర్ వాపసి'ని ఆమోదించేలా వారిపై ఒత్తిడి తీసుకువచ్చారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసతో నేరపూరిత దాడులు జరిగాయి.
అంతర్జాతీయ టోర్నమెంట్‌ల్లో పతకాలు గెలుచుకున్న మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వార్తలచ్చాయి.. అటు ప్రభుత్వం లేదా ఇటు పార్టీ ఎవరూ ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.
బిల్కిస్ బానో కేసులో దోషుల యావజ్జీవ శిక్షను తగ్గించిన వెంటనే 2014 జూన్‌లో పూణెలో మొహిసిన్ షేక్ కేసులో అల్లర్లతో ప్రమేయమున్నట్లు భావిస్తున్న 21మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. హిందూత్వ శక్తులు ఈ చర్యను స్వాగతించాయి. దీన్ని సవాలు చేస్తూ పై కోర్టులో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు పిటిషన్ దాఖలు చేయలేదు.
- దెబ్బతింటున్న న్యాయ వ్యవస్థ స్వతంత్రత
తమకు అనుకూలంగా వ్యవహరించే న్యాయ వ్యవస్థ వుండాలని కోరుకుంటున్న ప్రభుత్వం, సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలు సిఫార్సు చేసిన వివిధ పేర్లకు ఆమోద ముద్ర వేయడంలో జాప్యం చేయడం లేదా తిరస్కరించడం ద్వారా హైకోర్టులు, సుప్రీం కోర్టుకున్యాయమూర్తుల నియామకాల్లో జోక్యం చేసుకుంటోంది.
అత్యున్నత న్యాయ స్థానం ప్రభుత్వానికి అణగిమణగి ఉండేలా చూడాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజ్యాంగ ప్రసాదించిన న్యాయ వ్యవస్థ స్వతంత్రతను హరించడమంటే అది నిరంకుశ ప్రభుత్వ పూర్తి ఆధిపత్యం కిందికి పోవడమే.
- గవర్నర్ల పాత్ర
సమాఖ్యవ్యవస్థపై దాడిని ఉధృతం చేసేలా, బిజెపి యేతర పాలిత రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమ రాజ్యాంగ పదవిని దారుణంగా ఉల్లంఘిస్తూ, అధికార పార్టీ రాజకీయ లక్ష్ల్యాలను ముందుకు తీసుకెళ్లాలనిచూస్తున్నారు. కేరళ, తెలంగాణా, మహారాష్ట్ర, ఇప్పుడు తమిళనాడు గవరుర్లు, ఢిల్లీ లక్షద్వీప్, అండమాన్, పుదుచ్చేరి ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు వారి రాజ్యాంగ పదవులను ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ పాత్రను దెబ్బ తీయడానికి, ఫెడరల్ వ్యతిరేక ధోరణిని కొట్టిపారేయడానికి, అధికారాల కేంద్రీకరణకు మొగ్గు చూపడానికి గవరుర్ కార్యాలయాన్ని ఒక పావుగా వాడుకుంటున్నారు.
- త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు
భయోత్పాత రాజకీయాలకు, హింసకుపాల్పడుతూ, ప్రజాస్వామ్యానిు, చట్టబద్ధ పాలనను హరిస్తును బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించేందుకుగాను త్రిపురలో అన్ని లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల సహకారాన్ని సిపిఎం కోరుతోంది.
భయానక, భీతావహ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేకుండా చేయడమే లక్ష్యంగా హింసను ప్రేరేపిస్తోంది. పరిస్థితినిచక్కదిద్దేందుకు ఎనిుకల కమిషన్ తక్షణమే తగు చర్యలు చేపట్టాల్సి వుంది. త్రిపురలో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం క్రియాశీల జోక్యం అవశ్యం.
1. త్రిపురలో ఎనిుకలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగాలంటే ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించడమనేది ఒక ముందస్తు షరతుగా ఉండాలి. ఇందుకోసం లౌకికవాద, ప్రజాస్వామిక శక్తులకుసంఘీభావానిు ప్రకటిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించాలి
- 2. పెరుగుతున్న నిరుద్యోగం, దారిద్య్రం, అసమానతలతో ప్రజల జీవనోపాధులపై దాడులు కొనసాగడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి చివరి వారంలో అంటే 22 వతేదీ నుండి 28 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి.
- 2023-24 కేంద్ర బడ్జెట్‌లో లేవనెత్తే అంశాలతో పాటూ, ఈ నిరసన కార్యాచరణ ప్రచారాలు ఈ క్రింది డిమాండ్లను ప్రస్తావించాలి.
- ఉపాధి అవకాశాలను సృష్టించే మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి.
- 5కిలోల ఉచిత ఆహార ధాన్యాలతో పాటూ 5కిలోల సబ్సిడీ ఆహార ధాన్యాలను పునరుద్ధరించాలి.
- అధిక వేతనాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అపారంగా కేటాయింపులు పెంచాలి.
- సంపద, వారసత్వ పన్నులను విధించాలి
- సంపన్నులకు పన్ను రాయితీలను ఉపసంహరించాలి. అతి సంపన్నులపై పన్ను విధించాలి.
- ఆహారం, మందులతో సహా నిత్యావసర వస్తువులపై జిఎస్‌టిని ఉపసంహరించాలి.
3.ఏప్రిల్ 5న పార్లమెంట్‌కుర్యాలీనినిర్వహించాలను మజ్దూర్-కిసాన్ పిలుపునకు సిపిఎం తన పూర్తి మద్దతును ప్రకటించింది.
మార్చినెలలో దేశవ్యాప్తంగా ఈ క్రింది అంశాలపై సిపిఎం రాజకీయ ప్రచారాన్ని, ఆందోళనలను నిర్వహించాలి.
(ఎ) ఫెడరలిజంపై దాడులకుతోడు ఎనిుకైన రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ముఖ్యంగా బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలి. ఫెడరల్ స్వరూపాన్ని నాశనం చేసి, దానిస్థానంలో కేంద్రీకృత రాజ్య వ్యవస్థను రుద్దేందుకు చేస్తున్న యతాులను తిప్పికొట్టాలి.
(బి) న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయతాులు నిరసిస్తూ ప్రచారోద్యమం చేపట్టాలి. అత్యునుత న్యాయస్థానం స్వతంత్రతను హరించి, తనకు తాబేదారుగా మార్చుకోవాలని మోడీ ప్రభుత్వం చేస్తును యతాులను తిప్పికొట్టేందుకు ప్రజాతంత్ర శక్తులన్నిటినీ సమీకరించాలి.
(సి) ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరిగేలా చూసేందుకు, అందరికీ సమాన పాత్ర కల్పిలంచేలా ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి. సిపిఎం 23వ మహాసభ తన రాజకీయ తీర్మానంలో ప్రధానంగా నొక్కి చెప్పిన ఎనిుకల సంస్కరణలను వెంటనే ప్రవేశపెట్టాలి.
(డి) పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా, అక్కడి మితవాద ఇజ్రాయిల్ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గమైన అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలి.