
- ఇఎంఎస్‌కు, మల్లు స్వరాజ్యానికి రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సంపను భూస్వామ్య కుటుంబాల్లో పుట్టినా.. కార్మికవర్గ శ్రేయస్సు కోసం నిరంతరం తపించి పోరాడిన మహానీయులు ఇఎంఎస్ నంబూద్రిపాద్, మల్లు స్వరాజ్యం అని పలువురు కొనియాడారు. సాంప్రదాయ సంకెళ్లను ఛేదించుకుని కార్మికవర్గం నేతలుగా ఎదిగారని, యావజ్జీవితాన్ని ప్రజల కోసమే అంకితం ఇచ్చిన గొప్ప నేతలని పేర్కొన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నేతలు ఎంత నిరాడంబరంగా, నిస్వార్ధంగా, త్యాగపూరిత జీవితాలు గడపాలో ఈ ఇద్దరు నేతలు ఆచరించి చూపారని స్మరించుకున్నారు. సిపిఎం అగ్రనాయకులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్ 25వ వర్థంతి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సభలు నిర్వహించి ఘన నివాళులర్పించారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోనిబాలోత్సవ్ భవన్‌లో జరిగిన వర్ధంతి సభలో ఇరువురు నేతల చిత్ర పటాలకు పూలదండలు వేసి ప్రజలు నివాళులర్పించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి అధ్యక్షతన జరిగిన సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో మారుతున్న పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రజా పోరాటాలను, ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇఎంఎస్ సైద్ధాంతిక కృషి, మల్లు స్వరాజ్యం పోరాట స్పూర్తి దోహదపడతాయన్నారు. ఇఎంఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండు సంవత్సరాల్లోనే కేరళ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేశారని, విద్యాహక్కు చట్టం తీసుకొచ్చి అందరికి విద్యను అందించేందుకు కృషి చేశారన్నారు. దేవాలయాలపై భూ స్వాముల పెత్తనాన్ని తొలగించి కౌలు దారులకు హక్కులు కల్పించారని తెలిపారు. మల్లు స్వరాజ్యం చారిత్రాత్మక తెలంగాణా సాయుధపోరాటంలో తుపాకి పట్టుకుని శతృవులపై పోరాడిన యోధురాలనిఅయన కొనియాడారు. ఆమె పోరాడటంతో పాటుగా గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను ఛైతన్యవంతులను చేసి మహిళల చేత తుపాకి పట్టించి పోరాటంలోకి ఉరికించారని అన్నారు. కమ్యూనిజానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తుది వరకు తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి పనిచేశారన్నారు. తెలంగాణా సాయుధ పోరాటం దేశంలో భూ సమస్యను అజెండాగా ముందుకుతీసుకొచ్చిందని, దేశంలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకుపునాది వేసిందనిఅనాురు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా 1970 ప్రాంతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములనే ఈ రోజు తిరిగి కార్పొరేట్ సంస్దలకు ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమం బలహీనం అవ్వడం వలనే రివర్స్ భూ సంస్కరణలు అమలవుతున్నాయన్నారు. ఈ రోజు కేంద్రంలోనిమోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేశంపై మనువాదాన్ని రుద్దేంతుకు ప్రయతిుస్తోందన్నారు. అమృత మహోత్సవాలు పేరుతో ఆదానీలకుకార్పొరేట్లకు అమృతాన్ని, సామాన్యులకు గరళాన్ని కేంద్ర ప్రభుత్వం పంచుతోందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములను ప్రభుత్వం ఆదానీకి అప్పగిస్తోందన్నారు. తిరోగమనంలో నడుస్తున్న దేశాన్ని పురోగమనంలో నడపడానికి మల్లు స్వరాజ్యం పోరాటాలు ఈ రోజు స్పూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. రాజకీయాలు, సామాజికంగా వస్తును మార్పులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో డబ్బుతోపాటు కులం సమాజంలో పెద్ద ఎత్తున ప్రభావితం చూపుతోందనాురు. ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమానిు బలహీనపరచడానికి కులతత్వాన్ని సాధనంగా వాడుతునాురనాురు. ఈ అంశాలపై నంబూద్రిపాద్ కేరళలో అధ్యయనం చేశారన్నారు. వర్గ దోపిడితోపాటు, సామాజిక దోపిడికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను తెలియజేశారన్నారు. కమ్యూనిస్టులు మత సంస్ధలతో పొత్తులకుదూరంగా ఉండాల్సిన అవసరానిు తెలియజేశారనాురు. కులాలు మతాలకు అతీతంగానే తెలంగాణాలో పోరాటం సాగిందన్నారు.. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఆనాటి కమ్యూనిస్టు నాయకుల త్యాగాలు , ఆచరణాత్మక జీవితాలను ఈ తరం నాయకులు అలవర్చుకుని కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అసవరం ఉందన్నారు.


- 'అదానీ బుడగ' పుస్తకావిష్కరణ
ఈ సందర్భంగా సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రచురించిన పేలిపోతును ఆదానీ బుడగ పుస్తకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తమానంలో మనముందును కర్తవ్యాలను నెమరవేసుకోవడానికి మహనీయుల సంస్మరణ సభలు ఉపయోగపడతాయన్నారు. ఎఎంల్‌సి, గ్రాడ్యుయేట్ ఎన్నికలను పరిశీలిస్తే పోరాటాలకు, ఉద్యమాలకు మంచి రోజులు వస్తున్నాయని తెలుస్తోందన్నారు. ప్రజలను మభ్యపెట్టి పాలించాలనుకుంటున్న ప్రభుత్వాలు ఆటలు సాగవని స్పష్టం అవుతోందన్నారు. తొలుత సభలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి. మధు, మల్లు స్వరాజ్యం చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు.
