May 21,2023 21:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకుఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వ్యవసాయ పంప్‌సెట్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు గృహ వినియోగ కనెక్షన్లకు స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించడానికి పూనుకోవడం గర్హనీయమని పేర్కొనాురు. దీనివల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ప్రయతాునిు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వినియోగదార్ల నుండి ముక్కుపిండి విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేయడానికి, అదనపులోడ్‌, పీక్‌ డిమాండ్‌ పేరిట దొడ్డిదారిన వడ్డించడానికి అనిు కనెక్షన్లకూ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాలను కేంద్రప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యకుపాల్పడడం తగదని పేర్కొనాురు. నెలకు200 యూనిట్లు పైబడి వాడే గృహ వినియోగ కనెక్షన్లకు తొలి దశలోనూ, మిగతా వారికి రెండో దశలోనూ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించనున్నట్లు, అందుకు అదానీ కంపెనీకి టెండర్‌ ఖరారు కానునుట్లు వార్తలస్తునాుయని తెలిపారు. వినియోగదార్ల జేబుకు చిల్లు పెట్టి అదానికి కట్టబెట్టే యోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు నిర్ణయానిు ఉపసంహరించుకోకపోతే ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.