Aug 05,2022 21:16

శ్రీనగర్‌ :  జమ్ముకాశ్మీర్‌లో తూటాల మోత కొనసాగుతూనేవుంది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, సాయుధులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరు జవాను కాగా, మరొకరు సాధారణ పౌరుడు. రెడ్వాని ప్రాంతంలో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, తీవ్రవాద సాయుధులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు గాయపడ్డ జవాను తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.