Nov 25,2022 15:23

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పల లో గ్యాస్ గీజర్ కి గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి నార్పల మండల ఖాజీ ఫయాజ్, భాష షేక్స్, వలిలకు గాయాలయ్యాయి. స్థానిక కోటవీధుల్లో నివాసం ఉండే ఖాజీ ఫయాజ్ ఇంటిలో బాత్రూంలో ఉన్నటువంటి గ్యాస్ గీజర్కి తన స్నేహితుడు శిక్షావలితో కలిసి గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బంధువులు నార్పల వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్య సేవల కోసం 108 ద్వారా అనంతపురం సర్వజన వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వెంకటప్రసాద్ పరిశీలించారు.