Aug 07,2022 08:23

బర్మింగ్‌హామ్‌ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత పారా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినా పటేల్‌ స్వర్ణం సాధించారు. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 12-10, 11-2, 11-9 తేడాతో విజయం సాధించారు. టోక్యోలో పారాలంపిక్స్‌లో సిల్వర్‌ గెలుచుకున్న గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా .. టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత తరఫున గోల్డ్‌ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఈ పోటీల్లో అంతకముందు మరో పారా టేబుల్‌ టెన్సిస్‌ ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో కామన్వెల్త్‌లో భారత పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి.