Jan 15,2022 00:53

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న హైపర్‌ ఆది

ప్రజాశక్తి- మేదరమెట్ల : రావినూతలలోని శ్రీనివాస నర్సింగ్‌ హోమ్‌లో డాక్టర్‌ ఈడ్పుగంటి హృదయనాథ్‌ క్యాలెండర్‌ను జబర్దస్త్‌ కమిడియన్‌ హైపర్‌ ఆది శుక్రవారం ఆవిష్కరించారు. హాస్పిటల్‌ స్థాపించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్‌ హృదయనాథ్‌ హాస్పిటల్‌కు సంబంధించిన క్యాలెండర్‌ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. హైపర్‌ ఆదిని చూసేందుకు ప్రజలు హాస్పటల్‌ వద్దకు వచ్చారు. ఆయనతో సరదాగా సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రాజేష్‌, డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ పూనాటి రవి, డాక్టర్‌ రామినేని లక్ష్మినారాయణ, డాక్టర్‌ నన్నూరి కృష్ణ, డాక్టర్‌ చెన్నుపాటి రాజా, న్యాయవాది దండూరి వెంకటేశ్వర్లు, బాబూరావు, యడ్లపల్లి నరసింహారావు, హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.