Jun 21,2021 19:32

ప్రజాశక్తి - భీమవరం
         దాతలు, వైద్యుల సహకారంతో అల్లూరి సీతారామరాజు భగత్‌ సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత 40 రోజులుగా ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు కరోనా ఐసోలేషన్‌ను, కరోనా బారినపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారికి ఆహారం అందించే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నామని ఎబిఎస్‌వికె ఛైర్మన్‌ బి.బలరాం అన్నారు. శనివారం స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సేవా సమితికి అందించిన ఆర్థిక సహకారం కార్యక్రమంలో పాల్గొన్న బలరాం మాట్లాడుతూ సేవాసమితికి రూ.20 వేలు సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఎఎస్‌ఆర్‌ సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు తమ కుటుంబం తరపున 15 వేల రూపాయలు అందించడం, అలాగే ముందుగా కార్యదర్శి కలిదిండి గోపాలకృష్ణంరాజు 15 ఐసోలేషన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేయడానికి భూరి విరాళం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఎబిఎస్‌వికె, యువజన, విద్యార్థి కార్యకర్తలు ముందుకు వచ్చి బాధితులకు సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు. కార్యదర్శి కలిదిండి గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భగత్‌ సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం, వైద్య సిబ్బంది, యువత, విద్యార్థులు, కార్మికులు కలిసి కరోనా బాధితులకు రాత్రీపగలు తేడా లేకుండా సేవలందించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎబిఎస్‌వికె కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌, కన్వీనర్‌ వి.రాధాకృష్ణ, సిఐటియు నాయకులు బి.వాసు పాల్గొన్నారు.