Apr 20,2021 21:47

బహూకరించిన టేబుళ్లు

ప్రాజశక్తి-మండపేట
స్థానిక ఏడిద రోడ్డులోని ఎస్‌విఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ.ఐదు లక్షలు విలువైన 60 డైనింగ్‌ టేబుల్లను బహూకరించారు. ఈ సందర్భంగా విద్యాదాత, ఆలమూరు రైసుమిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి మాట్లాడతూ దాతలు అందించే సహయ సహకారాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత అధిరోహించాలన్నారు. అనంతరం దాతలు భమిడి రామచంద్రమూర్తి, రిమ్మలపూడి ప్రసాద్‌లను సత్కరించారు. కార్యక్రమంలో ఎంఇఒ ఎన్‌.రామచంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.షాలేమ్‌రాజు పాల్గొన్నారు.