Jul 29,2021 22:22

రైతులతో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌

      చిలమత్తూరు : మండలంలోని దేమకేతేపల్లి గ్రామంలో పెనుగొండ సబ్‌కలెక్టర్‌ మల్లారపు నవీన్‌ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 544 రోడ్డు నిర్మాణం వల్ల వర్షపు నీరు పంటపోలాల్లో ముంపునకు గురవుతుండడంపై ఆయన స్పందించారు. పంట పొలాల నుంచి నీటిని తొలగించి రైతుల సమస్యను పరిష్కరించాలని ఇరిగేషన్‌, రోడ్డు నిర్మాణ ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం దేమకేతేపల్లి సచివాలయం-1లో పర్యటించి వాలంటీర్లు, సచివాయల ఉద్యోగులతో మాట్లాడారు. ప్రజలు అందుబాటులో ఉండాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఈడిగ తిరుమలేశ్‌, తహశీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీవో సుధామణి, ఈవోఆర్డీ శకుంతల, పంచాయతీ కార్యదర్శి కెంచరాయప్ప, ఆర్‌ఐ భాస్కర్‌ రెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీలత, హౌసింగ్‌ ఏఈ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.