Sep 15,2021 19:25

ప్రజాశక్తి - ఉండి
దేశం గర్వించే గొప్ప ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఉండి లయన్స్‌ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు కాగిత మహంకాళి, గాదిరాజు రంగరాజు అన్నారు. బుధవారం లయన్స్‌ క్లబ్‌ తరపున కాపులపేటలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య నిజాయతీ గల వ్యక్తి అన్నారు. యువ ఇంజినీర్లు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రుద్రరాజు నరసరాజు, ముదునూరి శివరామరాజు మాట్లాడారు. అనంతరం రిటైర్డ్‌ ఇంజినీర్లు గంగుమోలు పేరయ్య, పెన్మత్స రంగప్రసాద్‌ రాజును క్లబ్‌ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో బుద్ధరాజు సుబ్బరాజు, కేశవరావు, బ్రహ్మ రెడ్డి పాల్గొన్నారు.
పెనుమంట్ర : మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఇంజినీర్స్‌ డే మోక్షగుండం విశ్వేశ్వరరావు జయంతిని గ్రామ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, హౌసింగ్‌ సిబ్బంది సమన్వయంతో హౌసింగ్‌, ఆర్‌బిఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖ మండల అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌ డిఇఇ డి.రాంబాబు, హౌసింగ్‌ డిఇఇ ఎన్‌.గోపాల్‌రాజు, ఇరిగేషన్‌ మార్టేరు సెక్షన్‌ ఎఇఇ గుబ్బల జయశంకర్‌, ఆర్డబ్ల్యూఎస్‌ ఎఇ పి.బుజ్జేశ్వరావు, హౌసింగ్‌ ఎఇ మల్లేశ్వరరావు, పంచాయతీ రాజ్‌ పిఆర్‌ఎఇ ఎస్‌ నాగిరెడ్డిని సత్కరించారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో కష్టపడి పని చేయాలని పంచాయతీ రాజ్‌ డిఇఇ డి.రాంబాబు అన్నారు.
పాలకొల్లు : స్థానిక 22వ వార్డులోని కొత్తపేట ప్రత్యేక మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో హెడ్‌ మాస్టర్‌ రాయపూడి భవాని ప్రసాద్‌ ఆధ్వర్యంలో జాతీయ ఇంజినీర్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాతచ లయన్స్‌ రీజియన్‌ కోఆర్డినేటర్‌ పిఎన్‌డివి.ప్రసాద్‌ మాట్లాడుతూ నవభారత్‌ నిర్మాణంలో సాటిలేని మేటి ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. అనంతరం పాలకొల్లు మున్సిపల్‌ డిఇ సాంబశివుడు, ఎఇ సతీష్‌, వార్డు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పి.తేజను సత్కరించారు. కార్యక్రమంలో పిల్ల శ్రీనివాస్‌, వట్టం గణేష్‌, జగ్గురోతు రాంబాబు పాల్గొన్నారు.
ఉంగుటూరు : ఇంజినీర్స్‌ డే సందర్భంగా చేబ్రోలు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పలువురిని సత్కరించారు. నారాయణపురం విద్యుత్‌ ఉపకేంద్రంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఎఇ శ్రీరామ్‌ను సన్మానించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు పి.కృష్ణంరాజు, సహాయ కార్యదర్శి అడపా శోభారాణి, కోశాధికారి వంగా రఘు, సభ్యులు పాల్గొన్నారు.
పెరవలి : ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఎంపిడిఒ కార్యాలయంలో ఇంజినీర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడారు. అనంతరం పంచాయతీ రాజ్‌ రామచంద్రారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎఇ రవిరాజ్‌, హౌసింగ్‌ ఎఇ ఎల్‌ఎన్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఎఇ శ్రీనివాస్‌, ఎలక్ట్రికల్‌ ఎఇసుధాకర్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులు శిరిగినీడి శేషగిరిరావు, పిడిజి మాదిరెడ్డి బాబూజీరావు, సెక్రటరీ ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: స్థానిక లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఇంజినీర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. సిఎస్‌టిఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్‌ హాల్లో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పంతగాని వెంకన్న అధ్యక్షతన ఇంజినీర్స్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇంజినీర్లను ఘనంగా సత్కరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌, జలవనరుల శాఖ డిఇ కృష్ణారావు మాట్లాడారు. అనంతరం ఇరిగేషన్‌ ఎఇ చదలవాడ భాస్కరరావు, ఎపిఇపిడిసిఎల్‌ ఎఇ సుబ్రహ్మణ్యం సత్యనారాయణ, మున్సిపల్‌ ఎఇ సంధ్యారాణి, సివిల్‌ ఇంజినీరు అభ్యుదయ కుమార్‌ సుఖబోగి, ఇరిగేషన్‌ డిఇ కృష్ణారావు, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సముద్రాల రామారావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి బి.మురళీ పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : అపర భగీరధుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పశ్చిమ డెల్టా బోర్డు ఛైౖర్‌ పర్సన్‌ గంజి మాలదేవి అన్నారు, స్థానిక పిడబ్ల్యుడి డివిజన్‌ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు జి. నాగేశ్వరరావు, వైసిపి పట్టణ కన్వీనర్‌ సంకు కొండ పాల్గొన్నారు.
గణపవరం : మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్‌ జెఇఇ ఎన్‌.మురళీ, ఇరిగేషన్‌ ఎఇ ఫణీంద్ర శర్మను ఘనంగా సన్మానించారు. క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.
నిడదవోలు:రోటరీ క్లబ్‌ ఆఫ్‌ నిడదవోలు సెంట్రల్‌ ప్రెసిడెంట్‌ మాచర్ల మధుసూదనరావు ఆధ్వర్యంలో నిడదవోలు ఎలక్ట్రికల్‌ డిప్యూటీ ఎక్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిరంజన్‌ బాబును, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ డివిఎస్‌ ప్రసాద్‌ను సత్కరించారు.
మొగల్తూరు: ఎంపిడిఒ కార్యాలయంలో ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్‌ ఎఇ, విద్యుత్‌ శాఖ ఎఇ, గృహ నిర్మాణ శాఖ ఎఇని సత్కరించారు.