May 16,2022 16:52

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఏజెన్సీలోని డెంగ్యూ,మలేరియా వ్యాధులపై గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.  ధనంజయ్ అన్నారు,సోమవారం  జాతీయ  డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ ధనంజయ్ జెండా ఊపి ప్రారంభించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలోని డెంగ్యూ,మలేరియా వ్యాధి ప్రబలకుండా ఐటీడీఏ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మలేరియా స్వ్రేయింగ్ చేయడం జరిగిందని, అదేవిధంగా ఐటీడీఏ ద్వారా గతంలో 79 లక్షల దోమతెరలు డెంగ్యూ మలేరియా నివారణ కొరకు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు,ఈ దోమతెరలు తీసుకున్న వారందరూ రాత్రి  పడుకునే సమయంలో తప్పనిసరిగా డెంగ్యూ మలేరియా వ్యాధిన పడకుండా దోమతెరలు ఉపయోగించుకోవాలని కోరారు, ఏజెన్సీలోని ఎవరికైనా డెంగ్యూ మలేరియా వ్యాధి లక్షణాలు ఉంటే సంబంధిత మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని సూసించారు,ఈ ర్యాలీ లో ఏఎన్ఎం లు,ఆశ వర్కర్లు డెంగ్యూ మలేరియా వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు,ఈ ర్యాలీ ఐటీడీఏ కార్యాలయం నుండి  అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ఏ డిఎంఅండ్హెచ్ఓ. డాక్టర్ అనూష, డాక్టర్ ప్రభాకర్,ఏఎంఓ.రామకృష్ణ,ఎంపిహెచ్ వో.పీటర్,ఏఎన్ఎం లు,ఆశా వర్కర్లు  తదితరులు పాల్గొన్నారు.