Jul 21,2021 07:11

రైతు, రైతు కూలి బిడ్డలం
రెక్కల కష్టం తెలిసిన శ్రామికుల పిల్లలం
ర్యాంకుల నిచ్చెనమెట్లను ఎక్కిన వాళ్ళం
డిగ్రీ ,బిఈడి, పీజీ పట్టాలు పట్టిన
విద్యావంతులం...
ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూసే యువకులం
కార్పొరేట్‌ సేవలో తరించే
కేంద్ర, రాష్ట్ర పాలకుల
మాయ మాటలు నమ్మి
జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ తో
దగాపడ్డ నిరుద్యోగులం.
ఖాళీగా ఉన్న లక్షల ప్రభుత్వ
ఉద్యోగాల భర్తీ కై
పోరుబాట పట్టిన
ఉద్యోగాన్ని సాధించాలనే
లక్ష్య సాధకులం.
ఆశా జీవులం.
నిరుద్యోగ సైనికులం.
ఎన్నికల హామీని అడిగితే
ఉద్యోగం ఇవ్వమని గళం విప్పితే
అక్రమ అరెస్టులు నిర్బంధాలు
ప్రజాస్వామిక హక్కులను
హరించి వేస్తుంటే
ఎదిరించి తీరుతాం..! పోరాడుతాం..!

- ఎస్‌.కె. బాజీ సైదా,
సెల్‌ : 8897282981