- ఎంఎల్ఎ దొరబాబుకు ఎస్ఎఫ్ఐ వినతి
ప్రజాశక్తి - పిఠాపురం
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐనాయకులు బుధవారం ఎంఎల్ఎ పెండెం దొరబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు మండలాల విద్యార్థినీ, విద్యార్థులు చుదువుకునే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేకపోవడం వలన షిఫ్టులు వారీగా కళాశాల నిర్వహించడం వల్ల తరగతి గదులు సరిపోవడం లేదని, అన్ని సబ్జెక్టు లకు క్లాసులు నిర్వహించు కోవడానికి వీలుకావడం లేదన్నారు. నిధులు కేటాయించిన ఇప్పటివరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి తక్షణమే పూర్తిస్థాయిలో భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మండల అధ్యక్ష కార్యదర్శులు సిద్దు, శ్రీకాంత్ కమిటీ సభ్యులు లోవరాజు, అయ్యప్ప, ప్రేమ్, ప్రకాష్, వెంకటేష్, రాజేష్, శ్రీరామ్, తదితరులు ఉన్నారు.
ఎంఎల్ఎ దొరబాబుఉ వినతిపత్రం ఇస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులుc