Oct 18,2020 20:57

ముంబై ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 50 పరుగులు చేశాడు. దీంతో ముంబై 15 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసిన ముంబై ఆటగాళ్లు దొరికిన బంతులను దొరికినట్టు బౌండరీలు బాదుతూనే వచ్చారు. తొలి ఓవర్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫోర్‌ బాదడంతో పాటు ఆ ఓవర్‌లో ఆరు పరుగులు రాబట్టారు. రెండో ఓవర్‌లో డికాక్‌, రోహిత్‌ చెరో ఫోర్‌ బాదారు. అర్షదీప్‌ సింగ్‌ మూడో ఓవర్‌లో రోహిత్‌ (9)ను బౌల్డ్‌ చేశాడు. అదే ఓవర్‌లో డికాక్‌ సిక్స్‌ బాదాడు. షమీ నాలుగో ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. మురగన్‌ అశ్విన్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు తీసి ముంబైని కష్టాల్లోకి నెట్టారు. అర్షదీప్‌ సింగ్‌ ఆరో ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ (7)ను వికెట్‌ తీసి ముంబై వెన్ను విరిచాడు. మురగన్‌ అశ్విన్‌ చేతికి చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 43 పరుగులకే ముంబై మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మాక్స్‌వెల్‌ ఏడో ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చి స్కోర్‌ను కట్టడి చేశాడు. ఎనిమిదో ఓవర్‌లో సిక్స్‌, తొమ్మిదో ఓవర్‌లో ఫోర్‌ బాదిన కృనాల్‌ పాండ్య పదో ఓవర్‌లో రెండు ఫోర్లతో చెలరేగిపోయాడు. 11వ ఓవర్‌లో డికాక్‌ సిక్స్‌ బాదగా.. 12వ ఓవర్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. 13వ ఓవర్‌లో కృనాల్‌ పాండ్య ఫోర్‌ బాదడంతో డికాక్‌, పాండ్య జోడి కలిసి 50 పరుగులు చేశారు. అదే ఓవర్‌లో డికాక్‌ మరో ఫోర్‌ బాదాడు. ఆ తరువాతి ఓవర్‌లో రవి బిష్ణోయి కృనాల్‌ పాండ్య 34 (30) పెవిలియన్‌ చేర్చాడు. దీపక్‌ హుడా చేతికి చిక్కి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చీ రాగానే హార్దిక్‌ పాండ్య సిక్స్‌ బాదాడు. 15వ ఓవర్‌లో ఫోర్‌, సిక్స్‌తో డికాక్‌ చెలరేగిపోయి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.