Sep 27,2021 01:55

మాట్లాడుతున్న అప్పలస్వామి

సింహాచలం : స్థానిక సహకార పరపతి సంఘం మహాజన సభ ఆదివారం అప్పన్న స్వామి కల్యాణ మండపంలో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన చైర్మన్‌ అప్పలస్వామి మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్‌దారులకు పూర్తి భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. అటువంటి వారిపై ప్రైవేట్‌ కేసులు వేస్తామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. బ్యాంకులో ఎటువంటి అవకతవకలూ జరగలేదని, గతంలో చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కొన్ని ప్రైవేటు సంస్థల్లో డిపాజిట్‌ చేశారని, వాటిని తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సహకార పరపతి సంఘం పాలక మండలి సభ్యులు బంటుపల్లి మహేష్‌, గంట్ల శ్రీనుబాబు, రాజనాల సత్తిబాబు పాల్గొన్నారు.