Mar 25,2023 00:21

మాట్లాడుతున్న ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ డైరెక్టర్‌ రమణ

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: భారత్‌ రక్షణ రంగంలో ఆఫీసర్‌ క్యాడర్‌లో తెలుగు వారి శాతం తక్కువగా ఉందని, అధికార హోదాపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నట్లు ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సంస్థ డైరెక్టర్‌ బి.వి రమణ అన్నారు. నగరంలోని బ్యాంకర్స్‌ కాలనీలోని ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యుపిఎసిఎస్‌, ఎన్‌డిఎ ఆఫీసర్స్‌, టిఇఎస్‌, సిడిఎస్‌ అధికారుల కేడర్‌లో ఉద్యోగాల్లో చేరేందుకు తెలుగు రాష్ట్రాల్లోని యువతను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్హతతో ప్లస్‌ 2తో డిఫెన్స్‌ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కోర్సును పూర్తిస్థాయి సైనిక శిక్షణతో జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. ఇంటర్‌ విద్య పూర్తి చేసుకున్న యువత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, పారామిలటరీ వంటి రంగాల్లో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.
25 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం
టెన్త్‌ ప్లస్‌ 2తో డిఫెన్స్‌లో ఆఫీసర్‌ ఉద్యోగాలు సాధించే దిశగా పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 25వ తేదీ వరకు షషష.ఱఅసఱaఅaతీఎyషaశ్రీశ్రీఱఅస్త్ర.షశీఎ వెబ్‌సైట్‌లో రూ.100 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. మేలో అకాడమీ ఆధ్వర్యాన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రెండేళ్ల పాటు ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సెంటర్‌ ద్వారా ఉచితంగా ఇంటర్‌ విద్యతో పాటు డిఫెన్స్‌ శిక్షణ అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 6281284246, 8712704951 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో చైర్మన్‌ గోవిందరావు, ఇన్‌ఛార్జి సురేంద్ర, ఎఒ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.