Jul 29,2021 22:19

మాట్లాడుతున్న డీఎస్పీ రమ్య

      హిందూపురం : దిశ యాప్‌ మహిళలకు రక్షణగా నిలుస్తుందని పెనుగొండ డీఎస్పీ రమ్య తెలిపారు. గురువారం పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో దిశా యాప్‌పై పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళా సంఘాల ఆర్‌పిలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డీఎస్పీతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్‌ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 వేల మంది మహిళలు దిశయాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. మిగిలిన వారు సైతం త్వరితగతిన ఈ యాప్‌ ను డౌన్లోడ్‌ చేసుకుని వారి స్మార్ట్‌ ఫోన్లో ఇన్‌ స్టాల్‌ చేసుకోవాలన్నారు. మహిళలు ఆపదలో దిశయాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయొచ్చని చెప్పారు. దీనిని ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు మన్సూరుద్దీన్‌, ఆస్రార్‌బాషా, టిపిఆర్‌ఒ సుబ్బరాయుడు, టిఎంసి రమాదేవి పాల్గొన్నాను. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న మహిళలకు లైఫ్‌ వరల్డ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వాటర్‌ బాటిల్స్‌, స్నాక్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైఫ్‌ వరల్డ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కన్వీనర్‌ ఉదరు కుమార్‌, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.