May 15,2022 08:39

యష్‌ నటించిన 'కేజీఎఫ్‌-2' ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఎండింగ్‌లో చాప్టర్‌ 3 కూడా వుందని దర్శకుడు హింట్‌ ఇచ్చారు. పార్ట్‌-3 బుక్‌ని ఓ టీవీ ఛానల్‌ అసిస్టెంట్‌ గుర్తించడం.. సముద్రంలో షిప్‌తో సహ రాఖీ మునిగిపోవడంతో సినిమాకు ఎండ్‌ కార్డ్‌ వేసిన ప్రశాంత్‌ నీల్‌ అతన్ని వెతుక్కుంటూ ప్రధాని రమీకా సేన్‌కు యుఎస్‌ అధికారులు ఇండోనేషియా అధికారులు ప్రత్యేకంగా ఓ ఫైల్‌ని అందించడంతో పార్ట్‌-2 సినిమా ముగిసింది. అంటే పార్ట్‌-3ని యుఎస్‌ ఇండోనేషియా నేపథ్యంలో సాగిస్తారా? అనే అనుమానాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మూడో భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించబోతున్నామంటూ నిర్మాత విజరు కిరగందూర్‌ తాజాగా ప్రకటించారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కేజీఎఫ్‌-3'కి సంబంధించిన విషయాల్ని వెల్లడించారు. '2023లో షూటింగ్‌ మొదలు పెడతాం. 2024లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం' అని స్పష్టం చేశారు.