May 29,2023 21:39

డిసిఎంఎస్‌ చైర్మన్‌ భావన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  రైతులకు ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు డిసిఎంఎస ్‌లో అందు బాటులో ఉన్నా యని చైర్‌పర్సన్‌ అవనాపు భావన ఒక ప్రకటన లో తెలిపారు. ఈ ఖరీఫ్‌ సీజనుకు రైతులకు కావలసిన 1121 రకంతో పాటు సోనామసూరి, సాంబమసూరి, ఫౌండేషన్‌, మొక్కజొన్న విత్తనాలు (నాన్‌ సబ్సిడీ) ఈనెల 31 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. విజయనగరం డిసిఎంయస్‌ కార్యాలయం వద్ద, బొబ్బిలి డిసిఎంయస్‌ డిపోలో రైతులకు అవసరమైన నాణ్యమైన వరి, మొక్కజొన్న విత్తనాలు అందుబాటు ధరలో లభిస్తాయని తెలిపారు. అన్ని రకాల ఎరువులు కూడా ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ ఏడాది విద్యార్థులకు లేపాక్షి నోట్‌బుక్స్‌ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.