Dec 02,2021 02:46

విశ్వనాధంను అభినందిస్తున్న విభాగ ఆచార్యులు

ప్రజాశక్తి-విశాఖపట్నం
ఆంధ్రవిశ్వవిద్యాలయం కామర్స్‌మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతిగా ఆచార్య పి.విశ్వనాథం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి డాక్టరేట్‌ ఉత్తర్వులను విశ్వనాధం స్వీకరించారు. అనంతరం బుధవారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సదర్భంగా ఆచార్య విశ్వనాధం మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించే దిశగా ఏయూ ఎంబిఏ విభాగాన్ని తీర్చిదిద్దడం, ఉపాది అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఆచార్య పి.విశ్వనాధం గతంలో విభాగంలో డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ డిసిఎంఎస్‌, బిఓఎస్‌ చైర్మన్‌గా పనిచేశారు. హెచ్‌ఆర్‌డిసి సంచాలకునిగా, ఆర్ట్స్‌ కళాశాల చీఫ్‌ వార్డెన్‌, అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం ఫ్యాకల్టీ క్లబ్‌ అద్యక్షునిగా, బిసిల లైజన్‌ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య విశ్వనాధంను విభాగ ఆచార్యులు అభినందించారు.