Oct 04,2022 00:12
దెబ్బతిన్న కారు

ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ జాతీయ రహదారి పరిధిలో కలికివాయ ఫ్లైఓవర్‌ మీద సోమవారం విజయవాడ నుంచి చెన్నరుకి వెళ్తున్న కారు అకస్మాత్తుగా టైర్‌ పగిలిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ నుంచి చెన్నరుకి వాళ్ల కుమారుడి పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ నిమిత్తం వెళ్తుండగా టైరు పంచరు కావడంతో కారు డివైడర్ను ఢ కొట్టింది. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో ఒంగోలు ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.