ప్రజాశక్తి - పరిగి : పెనుగొండ కేంద్రంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి సిఎం కప్ పోటీలలో ఎపిఆర్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కొడిగెనహళ్లి విద్యార్థులు తమ హవా కొనసాగించారు. అథ్లెటిక్, గేమ్స్ విభాగాలలో బహుమతులు బహుమతులు పొందారు. వంద మీటర్ల పరుగు పందెం పదోతరగతికి చెందిన పి కార్తీక్ మూడో స్థానంలో నిలిచాడు. 800 మీటర్ల పరుగు పందెంలో పదవ తరగతికి చెందిన జగదీష్ మొదటి బహుమతి, నితిన్ రెండో బహుమతి, హేమంత్ మూడో బహుమతి గెలుకున్నారు.200 మీటర్ల పరుగు పందెంలో పదోతరగతి విద్యార్థి పి.కార్తీక్ మూడవ బహుమతి పొందారు. జావలీన్త్రోలో పదోతరగతికి చెందిన వై.మనోహర్ మూడవ బహుమతి, లాంగ్ జంప్ పి.కార్తీక్ మూడవ బహుమతి గెలుచుకున్నారు. ప్రతిభ కనపర్చిన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం వి మురళీధర బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు షభనాభాను, రాఘవేంద్ర, ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రతిభా విద్యార్థులతో ఉపాధ్యాయులు