Sep 19,2023 23:48

ప్రజాశక్తి - పర్చూరు
సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్ధుల జిల్లా స్ధాయి క్రీడా పోటీలను బాపట్ల మున్సిపల్‌ హైస్కూలు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. పోటీల్లో పర్చూరు మండలం నాగులపాలెం ఎస్‌ఎన్‌ఆర్‌ఏ బధిరుల పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు. పాఠశాలకు 8 బహుమతులు సాధించారు. జూనియర్స్‌ బాలుర విభాగం రన్నింగ్‌లో శ్రీనాధ్‌, బ్లెస్సీబాబు, బాలికల విభాగంలో ముషారత్‌, సీనియర్స్‌ బాలుర విభాగంలో షార్ట్‌ఫుట్‌లో మదన్‌మోహన్‌కు ప్రధమ బహుమతి, లాంగ్‌జంప్‌లో అశోక్‌కు ప్రధమ బహుమతి, జావలిన్‌త్రో బాలికల విభాగంలో ప్రధమ బహుమతి సాధించారు. విజేతలను పాఠశాల యాజమాన్యం అభినందించారు.