
ప్రజాశక్తి - బాపట్ల
కర్లపాలెం మండలం చింతయపాలెంలో దళిత యువకుడు మధుపై జరిగిన దాడిని ఖండిస్తూ దళిత గిరిజన సంఘాల జెఏసి ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం వద్ద బాధితుడి కుటుంబ సభ్యులతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్‌పి మహేష్‌ను కలిసి బాధితుడు మధుకు న్యాయంచేయాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో అంటరానితనం నిర్మూలన రాష్ట్ర అధ్యక్షుడు జి చార్వక, మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి శీలం రోజన్ బాబు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు, కొచ్చేర వినయ్ రాజ్, మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్, మాల మహానాడు అధ్యక్షులు కోటి స్వామి, దార్ల రాజు, మంచాల భాగ్యరాజు, దేవరాజ్ పాల్గొన్నారు.