
దళితుడిపై దాడి అమానుషం
ప్రజాశక్తి-కావలి : దళితుడిపై అగ్రవర్ణ పెత్తందార్లు దాడి చేయటం అమానుషమని దాడిలో తీవ్రంగా గాయపడి ప్రవీణ్ కుమార్ హాస్పిటల్‌లో చికిత్స పోందుతున్న పొంతగాని మాల్యాద్రిని అదివారం ఎపి వ్యకాసం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు, ఎపి రైతు సంఘం జిల్లా అద్యక్షులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు పరామర్శించారు. లింగసముద్రం మండలం మెదర మీట్ల గ్రామానికి చెందిన పొంతగాని మాల్యాద్రి రోజు వారి కూలీ పనికి బైక్‌పై కావలికి వెళుతున్న సమయంలో మార్గం మధ్యలో కాపు కాసి రాజు వారి చింతలపాలెం వద్ద క్షురపాటి విజయ బాస్కర్‌రావు బైక్‌ను ఆపి విచక్షణ రహితంగా అత్యంత కిరాతకంగా మరణాయుధాలతో దాడి చేశారన్నారు. స్వాతంత్య్ర భారత దేశంలో దళితులై దాడులు అగడం లేని దళితులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని తెలిపారు. తోటి మానవులను ప్రేమించలేని క్రూర ఉన్మాదంతో కొట్టుకుపోతున్నారని, కులం అనే కుళ్లు మత్తు ఎక్కి దళితులపై మానత్వం మార్చి దళితులను అంటరానివారికి చూస్తున్నారన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా దళితులపై దాడులు అగటం లేదని అగ్రవర్ణ పెత్తందార్లు దళితుపై దాడులు సాగిస్తున్నారని దాడి చేసిన వారిపై ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ హత్య నేరం కింది కేసు నమోదు చేసి కఠినంగా శిక్షంచాలని కోరారు.