Oct 03,2022 01:13

కెవిపిఎస్‌ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న అట్లూరి రాఘవులు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : దళితుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని కెవిపిఎస్‌ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) 24వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం వద్ద పతాకాన్ని కెవిపిఎస్‌ జిల్లా అద్యక్షుడు అట్లూరి రాఘవులు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ సామాజిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులుకోసం రాష్ట్రంలో కెవిపిఎస్‌ ఏర్పడిందన్నారు. ఆత్మ గౌరవం, సమానత్వం. కులనిర్మూలన కోసం కెవిపిఎస్‌ పోరాడుతుందని. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ సాధన కోసం రాష్ట్రంలో విస్తత స్థాయిలో పోరాటాలు నిర్వహించి విజయం సాధించినట్లు తెలిపారు. కెవిపిఎస్‌ ఒంగోలు నగర కార్యదర్శి అత్తంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుల వివక్ష అంటరానితనం పై రాష్ట్రంలో విస్తత సర్వేలు నిర్వహించగా దీనికి స్పందించి ప్రభుత్వం జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి .రఘురామ్‌, పేతురు, రవి, శ్రీను, రాజు పాల్గొన్నారు మార్కాపురం : రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురామ్‌ కోరారు. బిజెపి ప్రభుత్వం నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీ, సుందరయ్య కాలనీల్లో కెవిపిఎస్‌ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామ్‌ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సమాజంలో మనోధర్మ శాస్త్ర భావజాలాన్ని విస్తారంగా ప్రచారం చేస్తూ... ప్రజల్లో మూఢవిశ్వాసాలు పెంచే ప్రయత్నాలు చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలలో పెరిగే అసంతప్తిని పక్కదారి పట్టించడానికి కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో కులతత్వాన్ని పెంచి తన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడం కోసం కుట్ర చేస్తుందని, ఈ కుట్రలను దళితులు ఇతర ప్రజానీకాన్ని కలుపుకొని ఎదుర్కోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో దళితులకు శాశ్వత ప్రయోజనం కల్పించే భూమి కొనుగోలు పథకాన్ని ప్రారంభించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు హక్కులను నిరోధించే పెత్తందారుల ఆగడాలు అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు జవ్వాజి రాజు, మరియబాబు, బాబు, శ్యాము, మార్తమ్మ, రాణి, అంకమ్మ, రూబేను, కాశయ్య, ఎలీషా, ప్రమీల, రాజబాబు పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ విధానాలను దళితులందరూ తిప్పికొట్టాలని కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జవ్వాజి రాజు కోరారు. కెవిపిఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని గోగులదిన్నె గ్రామంలో కెవిపిఎస్‌ జెండాను కెవిపిఎస్‌ నాయకుడు ఎం.బాలశేషయ్య ఆదివారం ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బిజెపి విధానాల ఫలితంగా దళితులపై దాడులు పెరిగాయన్నారు. గిరిజనులు, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.ఈ కార్యక్రమంలో సిటియు జిల్లా ఉపాధ్యక్షుదు పి.రూబెన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా బాలనాగయ్య, కెవిపిఎస్‌ నాయకులు మున్నంగి రమేష్‌, వి.రమేష్‌, ఎం.అనిల్‌, వి.ఏసుబాబు, పి.శేషగిరిరావు, ఎం.కుమారి, ఎం.చిన్న సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
హనుమంతునిపాడు : కెవిపిఎస్‌ ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా కెవిపిఎస్‌ జెండాను కెవిపిఎస్‌ మండల నాయకకుడు కత్తి ఏబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1998 అక్టోబర్‌ 2న కెవిపిఎస్‌ ఆత్మగౌరవం సమానత్వం, కులానిర్మాణ లక్ష్యంతో ఏర్పడింనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంపి వైద్యుల యూనియన్‌ నాయకులు ఆండ్రా వినరు, టాయిలెట్స్‌ యూనియన్‌ నాయకులు దారా నారాయణ,డివైఎఫ్‌ఐ నాయకులు కొమ్మల చిన్నరామయ్య, సుధాకర్‌ దానేల,సుంకుశాల జేమ్స్‌, చిన్న పాల్గొన్నారు.