Oct 03,2022 19:18

 ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణం రాంజల దోబీఘాట్‌కు ప్రహరీ నిర్మించాలని రజక సంఘం జిల్లా అధ్యక్షులు ముక్కన్న కోరారు. సోమవారం ఆదోని కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డికి, ఆయన తనయుడు జయ మనోజ్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రహరీ లేకపోవడం వల్ల దోబీఘాట్‌ ప్రదేశమంతా అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. బట్టలు ఉతికేటప్పుడు జంతువులు ఆ ప్రదేశంలో సంచరిస్తుండడం వల్ల ఆటంకం కలుగుతోందని చెప్పారు. ప్రహరీ నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరామని తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. పట్టణ అధ్యక్షులు ఈరన్న, నాయకులు రామన్న, నాగేష్‌, ఉరుకుందు పాల్గొన్నారు.