Nov 20,2020 21:50

న్యూఢిల్లీ: ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణపతక విజేత అనిత యాదవ్‌కు డోపింగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. టెస్టోస్టెరాన్‌ లెవల్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) ఆమెపై సస్పెన్షన్‌ విధించింది. అక్టోబర్‌ 22నుంచే ఆమెపై సస్పెన్షన్‌ అమల్లోకి వచ్చింది. గతేడాది మార్చిలోనే ఫెడరేషన్‌ కప్‌ మీట్‌లో ఆమె శాంపిల్స్‌ను సేకరించారు. 19 నెలల తర్వాత ఇప్పుడు దాని ఫలితాలు వచ్చాయి. నాడా ఎనిమిది నెలల తర్వాతే మళ్లీ శాంపిల్స్‌ సేకరణ మొదలుపెట్టింది. ఈ మధ్యే టాప్‌ రెజ్లర్లు నర్సింగ్‌ యాదవ్‌, బజరంగ్‌ పూనియా, వినేష్‌ పోగాట్‌, పూజా దండాలతోపాటు ఐపిఎల్‌లో ఆడిన 48 మంది క్రికెటర్ల శాంపిల్స్‌నూ సేకరించడం విశేషం. శాంపిల్స్‌ను జర్మనీలోని కొలోన్‌కు పరీక్షల కోసం పంపించారు.