
- నాబార్డ్ డిడిఎంఎ పార్థవ
ప్రజాశక్తి -కర్నూలు జిల్లాపరిషత్: డ్రైవింగ్ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని నాబార్డ్ డిడిఎ ఎ.పార్థవ అన్నారు. నాబార్డ్ సహకారంతో పీస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోనీ నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మంగళవారం స్థానిక విజయదుర్గా డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్డిఎం వై.వెంకటరమణ, డిఐసి జిఎం సోమశేఖర్ రెడ్డి, కెడిసిసి సిఇఒ పి.రామాంజనేయులు, ఎస్పిఇఎస్ ప్రెసిడెంట్ వి. మోహన్ రాజు అతిధులుగా పాల్గన్నారు. పీస్ రురల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎం. దరగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది ట్రైనీస్ పాల్గన్నారు. నాబార్డ్ డిడిఎం పార్థవ మాట్లాడుతూ సొసైటీ ద్వారా 30 మంది నిరుద్యోగ యువతకు ఎల్ఎంవి డ్రైవింగ్ పై 30 రోజులు ట్రైనింగ్ నేర్పిస్తామన్నారు. తరువాత డ్రైవింగ్ పరీక్ష ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని, ఆ తరువాత డ్రైవింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు పొందవచ్చు అన్నారు. సిఇఒ మాట్లాడుతూ కెడిసిసిబి బ్యాంకు తరపున డ్రైవింగ్ అవకాశాలు ఉంటే తప్పకుండ రుణాలు ఇప్పిస్తామన్నారు.