Jun 02,2023 23:27

డ్రెయినేజీ పనులను పరిశీలిస్తున్న సర్పంచి 

శింగరాయకొండ : శింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాన్‌ నగర్‌ నూతనంగా నిర్మించిన డ్రైనేజీని సర్పంచి తాటిపర్తి వజన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అవసరమైన చోట డ్రైనేజీలను నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తన్నీరు నాగేశ్వరరావు, నాయకులు మస్తాన్‌ , ఫిరోజ్‌, సిరిమల్లె రమేష్‌, సవలం కోటేశ్వరరావు, జాన్‌ కిషోర్‌, అనిల్‌, చేవూరి కోటేశ్వరరావు, ప్రణరు కుమార్‌ పాల్గొన్నారు.