Oct 05,2022 07:19

దసరా వచ్చింది
సరదా తెచ్చింది
పాటలు పాడుతూ
ఆటలు ఆడుతూ
ఆనందంగా గడుపుదాం

దసరా వచ్చింది
సరదా తెచ్చింది
కథలు చదువుతూ
చిత్రాలు గీస్తూ
ఆహ్లాదంగా గడపుదాం

దసరా వచ్చింది
సరదా తెచ్చింది
పజిల్స్‌ పూరిస్తూ
బొమ్మలు పేరుస్తూ
సంతోషంగా గడుపుదాం

దసరా వచ్చింది
సరదా తెచ్చింది
మ్రొక్కులు మొక్కుదాం
మొక్కలు పెంచుదాం
ఉత్సాహంగా గడుపుదాం

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
77802 77240